క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలకు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ తల్లిదండ్రుల కలలను చెరిపేస్తున్నారు. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని అనవసరంగా ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. తాజాగా.. ఓ విద్యార్థి ఐఐటీ ఫలితాల్లో మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్లో నష్టం రావడంతో సూసైడ్ కు పాల్పడ్డాడు. మృతి చెందిన విద్యార్థి ఓయూలో పీజీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఓయూ క్యాంపస్ హాస్టల్ లో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కోరుట్లకు చెందిన నవీన్ గా గుర్తించారు. కాగా.. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో రూ.3 లక్షల వరకు పోగొట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపుతుంది. ఐయోవా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఓ టీనేజర్ తుఫాకీతో కాల్పులకు దిగడంతో 11 ఏళ్ల స్టూడెంట్ మృతి చెందాడు. గాయపడ్డవారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 5వ తరగతి చదవుతున్న విద్యార్థిని లేఖ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ.. అంజలి అనే విద్యార్థిని సీఎంను లేఖలో కోరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి.. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర…
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన గొడవలో 4వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ముగ్గురు విద్యార్థులు జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారిపోయాడు.. 15 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు.. పాఠాలు నేర్పాల్సిన గురువు.. ప్రేమ పాఠాలు బోధించాడు.. తాను ప్రేమిస్తున్నాను అని నమ్మబలికాడు.. విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు.. తాళికట్టి.. ఇక, మనకు పెళ్లి అయిపోయింది.. అంటూ ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు.
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రమాదవశాత్తూ వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడిన మూడు రోజుల తర్వాత రెండో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
Gandhi Medical College: ఏదైన హద్దుల్లో ఉంటె అందం. హద్దు మీరితే అనర్ధం. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం పడగ విప్పిన ర్యాగింగ్ పెనుభూతం. సాధారణంగా కళాశాల విద్య, వికాసాన్ని అందించడంతోపాటుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను కూడా అందిస్తుంది. కళాశాలలో అల్లరి చేయడం సహజం. అల్లరి చెయ్యాలి కానీ ఆ అల్లరి కూడా అందంగా ఉండాలి. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలి. జూనియర్స్ ని సోదర భావంతో చూడాలి. అన్నింటికీ మించి విద్యార్థికి క్రమశిక్షణ, సంస్కారం…