నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల స్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. నెల్లూరు రూరల్ పరిధి బీవీ నగర్‌లోని కురుగొండ నాగిరెడ్డి నగరపాలక సంస్థ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పాఠశాలలో ఇటీవల అదనపు తరగతుల కోసం భవనాలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణం సాగుతున్న ప్రాంతం వద్ద విద్యార్థులు ఆడుకుంటుండగా... ఒక్కసారిగా స్లాబ్ కింద పడిందని.. దీంతో 9వ తరగతి చదువుతున్న గురు మహేంద్ర అనే విద్యార్థి మృతి చెందినట్టు చెబుతున్నారు.
సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా…
రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న పదహారేళ్ల విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మరణించిన విద్యార్థి యతేంద్ర ఉపాధ్యాయగా గుర్తించారు. అయితే.. నిన్ననే తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా, ఈరోజు గుండెపోటుతో మరణించాడు. బండికుయ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో తరగతి గది లోపలికి వస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్‌కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గదిలో నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఏడాది కోటాలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.…
Young woman attempted suicide in Ghatkesar: ప్రేమించిన వాడి మోసంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. వరంగల్ హైవేలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… Also Read: NKR21: ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫస్ట్ లుక్, గ్లింప్స్…
నిండు నూరేళ్లు బతకాల్సిన బాలిక 13 ఏళ్లకే కనుమరుగైంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రోజున 14వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడింది. కాగా.. బాలిక 7వ తరగతి చదువుతుంది. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అని బయటికొచ్చి.. స్కూల్ బస్సు రాకపోవడంతో మళ్లీ ఇంట్లోకి వెళ్లింది.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు.
Student Teacher Romantic Video: ఇదివరకు రోజుల్లో స్కూల్ టీచర్ అంటే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.మరికొందరైతే ఏకంగా స్టూటెంట్లతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అందులో., క్లాస్ లో ఫేర్ వెల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా డాన్స్…
బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. యూనిఫాం ధరించకుండ పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థిని చితకబాదాడు హెడ్ మాస్టర్. తీవ్రంగా కొట్టడంతో వీపుపై పెద్దపెద్ద గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.