తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు.
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి హద్దు దాటి వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా పోస్టు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. Also…
బీహార్లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్లో తుపాకీతో హల్‌చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యంతో షాక్కు గురైంది. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.