Love Harassment: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపుల కారణంగా మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో శారద, కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. మొదటి అమ్మాయి శాలిని సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో వసతి గృహంలో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుతోంది.
Read also: Ponguleti Srinivasa Reddy: ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి
ఇటీవల ఆమె బాలాజీ నగర్ లోని తన ఇంటికి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన శివ కూల్ డ్రింక్ షాపులో పనిచేస్తున్నాడు. శాలిని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ప్రేమ పేరుతో లైగింక వేధింపులు భరించని శాలిని చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడించిది. నిన్న రాత్రి సమయంలో శివ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..