పిఠాపురం జనసేనకు పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు గెలిచిన తర్వాత తొలిసభ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ కోసం ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారన్నారు.. పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని..