Story Board: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్…సామాన్యుల ప్రాణాలు తీస్తున్నాయి. ఊరించే ప్రకటనలు…సెలబ్రెటీల ప్రచారంతో…అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులనుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల దాకా…వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. కోట్లు పెట్టి బెట్టింగ్ ఆడుతున్నారు. అప్పులు చేసి బెట్టింగ్‌లో పెడుతున్నారు. అది సరిపోక…బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ యాప్స్…సామాన్యులకు మరణశాసనం రాస్తున్నాయి. బెట్టింగ్ ఆడవద్దని చెబుతున్నా…కొందరు పట్టించుకోవడం లేదు. డబ్బు పొగొట్టుకున్న తర్వాత…ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇంకొందరు దొంగలుగా మారుతున్నారు. మరికొందరు…
Story Board: రెండున్నర నెలల పాటు రాజకీయ వేడి రాజేసిన.. బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. బీహార్లో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న జాతీయ పార్టీలకు, పరువు కాపాడుకోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీలకూ.. ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే అనడంలో సందేహం లేదు. గతంతో పోలిస్తే ఈసారి బీహార్ ఎన్నికల ప్రచారంలో కాస్త మార్పు కనిపించింది. ఈసారి కులాలు, మతాల కంటే అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా చర్చ జరిగింది. అలాగని కుల ప్రభావం అసలు లేదని…
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది.
Story Board: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు బలి తీసుకుంది. జరిగిన ఘటనను విశ్లేషిస్తే.. ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్,ఆర్టీఏ అధికారులు.. ఇలా అన్నివైపుల నుంచీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. డ్రైవర్లు ప్రమాద సమయంలో నిద్రమత్తులో ఉన్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయం అలాంటిది. సహజంగా ఆ సమయంలో నిద్రవచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం. హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన…
StoryBoard: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కష్టాలు కొనితెచ్చుకుంటోంది. సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం మంత్రి పదవులు పొంది నేతలు.. కలిసికట్టుగా ప్రత్యర్థులపై విరుచుకుపడాల్సిందిపోయి.. తమలో తామే కలహించుకుంటున్నారు. పోనీలే బయటపడటం లేదుగా అని ఇన్నాళ్లూ పార్టీ క్యాడర్ సరిపెట్టుకుంది. కానీ ఆ ఊరట కూడా వారికి దక్కకుండా చేస్తూ.. మంత్రి పొన్నం ప్రభాకర్.. తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై రెచ్చిపోయారు. ఏకంగా దున్నపోతు అంటూ నోరుపారేసుకున్నారు. అదీ ప్రెస్మీట్లో ఈ ఘటన జరగడంతో..…
Story Board: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికీ పూర్తి సంతోషాన్నివ్వలేదు. సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాకిస్తే.. అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్నూ నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ సింహనాదం చేసింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో.. కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం…
Story Board: సోషల్ మీడియా శృతిమించిపోతోంది. వ్యక్తులు, సంస్థలు.. ఆఖరికి వ్యవస్థల్ని కూడా దాటేసి..ప్రభుత్వాలకూ తలపోటుగా తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రులే రంగంలోకి దిగి.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్న వారికి వార్నింగులు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చేసింది. తెలంగాణలో సోషల్ మీడియా హద్దుదాటిన వారిపై రౌడీషీట్లు తెరవాలనే ఆదేశాలు వచ్చేశాయి. అటు ఏపీలో కూడా సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసలు జాతీయ స్థాయిలోనే ఓ సమగ్ర చట్టం అవసరమనే…
Story board: బంగారం ధర మరోసారి ఆల్టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే…
కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు…