రాయి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. గుడివాడ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో పెత్తందారుల ఓటమి తప్పదు అని హెచ్చరించారు.. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదన్న ఆయన.. ఈ స్థాయికి వాళ్లు దిగజారారు అంటే మనం విజయానికి దగ్గరగా, వాళ్లు…
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో కేంద్ర అధికార పార్టీ బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఏళ్ల నాటి సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతుంది. చింద్వారా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లడీ గేమ్ గోట్‌మార్‌ను మరోసారి ఆడారు. గత వందేళ్లుగా ఛింద్వారాలోని పాంధుర్నాలో పోలా పండుగ రెండో రోజున గోట్‌మార్ ఫెయిర్ నిర్వహిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడి జనాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు.
Vande Bharat Express: ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత రైల్వే తీసుకువచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడికి గురైంది.
వందే భారత్ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే
సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుపై మరోసారి రాళ్లదాడి జరిగింది. రైల్వేశాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
BBC documentary on modi: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జెఎన్‌యూ) మరోసారి వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినా.. పట్టించుకోకుండా లెఫ్ట్ విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ) డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అయింది.
Stone Pelting: చికెన్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్‌లోని సరాయ్ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి…
Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు.…
కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో అల్లరి మూకలు ఏకంగా పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ సహా పోలీసులు అక్కడే ఉన్నారు. వారు ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేసినా…