గురువారం ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి రెండు సూచీలు వేగంగా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య.. సెన్సెక్స్ 74,501 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 80.00 పాయింట్ల లాభంతో 22,514.70 పాయింట్లకు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 801.67 పాయింట్లు కోల్పోయి 71,140కి పడిపోయింది. నిఫ్టీ 21550 పాయింట్లు పడిపోయి.. 215 పాయింట్లు కోల్పోయాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకోగా.. ఈరోజు అదే స్థాయిలో పతనమయ్యాయి. కాగా.. ఉదయం గ్రీన్ మార్క్ తో ప్రారంభమైన మార్కెట్ ఎట్టకేలకు రెడ్ మార్క్ తో ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో మార్కెట్‌లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు…
స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా 329 పాయింట్లకు చేరుకుని నష్టాల్లో ముగిసింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ క్షీణతలో రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. అంతేకాకుండా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. సుమారు మూడు శాతం…
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30…
ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
ఈరోజు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి.