గురువారం ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి రెండు సూచీలు వేగంగా ట్రేడయ్యాయి. మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య.. సెన్సెక్స్ 74,501 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 80.00 పాయింట్ల లాభంతో 22,514.70 పాయింట్లకు చేరుకుంది.
నేడు విద్యుత్, ఐటీ రంగాల్లో 0.5 నుంచి 1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 0.7-1.16 శాతం మధ్య పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 437 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 7 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది.
WhatsApp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్..! ముఖ్యంగా వీడియోల కోసం
టాప్ గెయినర్స్
నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (3.06%), ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్ (1.72%), టెక్ మహీంద్రా (1.74%), టైటాన్ (1.98%) దివీస్ ల్యాబ్, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, విప్రో, మారుతీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
లూజర్ స్టాక్స్
మరోవైపు.. ఒఎన్‌జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, బిపిసిఎల్, భారతీ ఎయిర్‌టెల్ (-1.44%) ఎస్బీఐ, సిప్లా, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.