కరోనా మహమ్మరితో ప్రపంచం ఓవైపు పోరాడుతుండగా అప్ఘన్ మాత్రం తాలిబన్లతో పోరాడాల్సి వస్తోంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు అప్ఘన్లో రెచ్చిపోతున్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆదేశ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్ల రాక్షస పాలన ఇదివరకే ఓసారి చూసిన అప్ఘన్లు వారి పాలనను ఒప్పుకునేది లేదని తెగెసి చెబుతున్నారు. తాలిబన్లు మాత్రం తమ పాలనను అప్ఘన్లు ఒప్పుకోవాల్సిందే.. లేదంటే చావాల్సిందే అన్నట్లుగా…