మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇటీవల ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎంకు విన్నవించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీం అమలు చేయనున్నారు. మొదటి దశగా ఐదువందల బస్సుల్లో… తరువాతి దశలో 2500 బస్సుల్లో…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు……
స్టాలిన్ సర్కార్ తమిళనాడులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ర్ట ఆర్థికాభివృద్ధి కోసం పలు కీలక ప్రాజెక్టులను రాష్ర్టానికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ సంఖ్యను తగ్గించారు. రాజకీయ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడితే వారి పైన కఠిన చర్యలు తీసుకొనున్నట్టు తెలిపారు. రాష్ర్టంలో కోవిడ్ సెంకడ్ వేవ్‌ను తమిళనాడు ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంది. ఇండస్ర్టీయల్ పాలసీలో కూడా నూతన మార్పులను తీసుకువచ్చింది. విద్యా వ్యవస్థలోనూ సరికొత్త మార్పులను…
భారీ వర్షాలతో తమిళనాడు ఇప్పటికే తడిసి ముద్దవుతుంది. ఆ రాష్ట్ర సీఎం కూడా తమిళనాడుకు ఎవ్వరూ రావొద్దని సూచించారు. తాజాగా తమిళనాడుకు మరో భారీ వర్ష ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే చెన్నైలో 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని, నవంబర్ 10, 11 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్రవాతావరణ శాఖ డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగా ళ ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిం దన్నారు. ఇది…
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు మిగిలిన రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే కొత్తగా గెలిచిన సీఎం స్టాలిన్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. నూతన సంస్కరణలతో తన మార్కు పాలనను తమిళనాడు ప్రజలకు చూపిస్తున్నారు. పరిపాలనా పరమైన నిర్ణయాల్లోను, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్‌కు ఎవ్వరూ సాటిలేరు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 18ని తమిళనాడు ప్రత్యేక రోజుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనిఖీలు చేయడంతో…
వినూత్న నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకెళ్తున్నారు.. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.. మరో వైపు.. అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. ఇక, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో అడుగుపెట్టారు సీఎం స్టాలిన్.. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్… అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా…
నిన్నటి రోజున దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరిగాయి. దేశంలోని 202 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 లక్షల మంది ఈ పరీక్షలకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది.…
ఎక్కడైనా ముఖ్యమంత్రిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం.. సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కడబడితే అక్కడ మన నేతలు మాట్లాడడం చూస్తుంటాం.. ఇక, అసెంబ్లీలో సీఎం ఎదుటే.. పొగడ్తలు ఎన్నోసార్లు లైవ్‌లో చూసిఉంటారు.. కానీ, తమిళనాడు సీఎం స్టైలే వేరు.. శాసనసభలో మైకు దొరికిందే తడవుగా తనను పొగడ్తలతో ముంచెత్తుతున్న ఎమ్మెల్యేలను సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఓ ఎమ్మెల్యే తనను పొగుడుతూ ప్రసంగిస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.…
తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టాలిన్ పేరు మారుమ్రోగిపోతున్నది. గతంలో స్టాలిన్ చెన్నై మేయర్‌గా పనిచేసిన రోజుల్లో చాలా ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపించేవారు. నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలపై చర్చించేవారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన దినచర్యలో ఎలాంటి మార్పులు చేయలేదు. నిత్యం యోగా, సైక్లింగ్, జిమ్ చేయడం తప్పనిసరి. 68 ఏళ్ల వయసులో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన…