Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ కృష్ణతేజ అతిథి గృహం వరకు విస్తరించింది.
డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే? డిసెంబర్ నెల దర్శనాలకు సంబంధించిన టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుని వస్తే.. మరికొంతమంది భక్తులు నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలిపిరి నడక మార్గం నుంచే కాకుండా శ్రీవారి మెట్టు నుంచి కూడా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.
తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. కాసేపట్లో శ్రీవారి దర్శనంతో పాటు.. ఇతర సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్‌మెంట్‌లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడ్డారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.46,470 టికెట్లలో లక్కీ డిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. ముందువచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు జూన్ 29వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.…