TTD: మీరు తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
Read Also: High Blood Pressure: నీటితో హై బీపీకి చెక్… పరిశోధనలో కీలక విషయాలు..
చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయునున్నారు. రేపటి రోజున 35 వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. సర్వదర్శనం భక్తులను ఇవాళ రాత్రికి క్యూలైన్‌లోకి అనుమతించడం నిలిపివేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి రోజుకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు, సర్వదర్శనం భక్తులు ,శ్రీవాణి టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేసింది టీటీడీ.. ఇక ఆన్‌లైన్‌లో మూడు నెలల క్రితమే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన భక్తులకు టోకెన్ల జారీ నిలిపివేసింది టీటీడీ.. రేపు ఉదయం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవతో దర్శనాలు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవాణి దర్శన భక్తులను దర్శనానికి అనుమతించడంతో దర్శనాలు నిలిపివేయనున్నారు.
Read Also: Ghaati : షూటీ డే – 1 కలెక్షన్స్.. బయ్యర్స్ కి ఘాటు పడింది.
అటు తర్వాత శ్రీవారికి ఏకాంతంగా తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్య సమర్పణ చేసిన అనంతరం ఏకాంతసేవ నిర్వహించునున్నారు. సరిగా మూడున్నర గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం రేపు రాత్రి 9:50 నుంచి ఎల్లుండి వేకువుజము ఒంటిగంట 31 నిమిషాల వరకు సంభవిస్తున్న నేపథ్యంలో ఆగమశాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయ ద్వారాలను మూసి వేయనున్నారు. గ్రహణం వీడిన అనంతరం ఎల్లుండి ఉదయం 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి ముందుగా శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారికి ఏకాంతంగా సుప్రభాత, తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్య సమర్పణ చేసిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ. రేపటి రోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేయగా ఎల్లుండికి సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేసింది. ఇక అన్న ప్రసాద సముదాయాన్ని రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసివేయనున్నారు. మరోవైపు భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ. 30 వేల ఆహార పొట్లాలను ముందస్తుగానే సిద్ధం చేసి రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైభవ మండపం, పీఏసీ ఒకటి, రాంబగిచా బస్టాండ్, ఏఎన్ సి వంటి ప్రాంతాలలో పంపిణీ చేయనున్నారు. గ్రహణం కారణంగా 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేస్తుండడం.. 15 గంటల పాటు దర్శనాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తిరుమల విచ్చేసిన భక్తులు అందుకు అనుగుణంగా తమ పర్యటనను ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తుంది టీటీడీ..