శ్రీశైలం ప్రాజెక్టులో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. రేపటి నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.. ఇక, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో స్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలిపివేయనున్నట్టు ప్రకటించారు ఈవో లవన్న… సామూహిక అభిషేక భక్తులకు శ్రావణ శని,…
* నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్, వెస్టిండీస్‌తో 3 వన్డేలు ఆడనున్న టీమిండియా * నేడు శ్రీశైలానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్న అంబటి * నేడు కోనసీమ జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన, ఆత్రేయపురం, వానపల్లి వరద బాధితులను పరామర్శించనున్న సోమువీర్రాజు * ఢిల్లీలో…
పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెంటచింతలలో టాటా ఎస్ వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. . మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయమనమయ్యారు. కాసేపట్లో ఇంటికి వెళ్లనుండగా ఇంతలోనే మృత్యువు కాటేసింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. Konaseema:…
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నాడు హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానం హాలులోని హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి, అమ్మవార్లకు రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. అంతే కాకుండా 267 గ్రాముల బంగారం, ఐదు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137…
శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం.. ఇప్పుడు ఉగాది మహోత్సవాలకు సిద్ధమవుతోంది.. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు మల్లన్న దర్శనానికి వస్తుంటారు.. ఉగాది మహోత్సవాలకు మాత్రం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.. ఈ సందర్భంగా వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు.. శ్రీశైలంలో ఈనెల 30వ తేదీ…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.. ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఇక, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో రేపటి (శనివారం) నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం టెంపుల్ ఈవో లవన్న. Read Also: Ukraine Russia War: జెలెన్స్కీ హత్యకు మూడు కుట్రలు..! గర్భాలయ…