Srisailam Dam Gates Opened: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల తాకిడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది… కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇన్ ఫ్లో రూపంలో 1,08,000 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,00,374 క్యూసెక్కులుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 9.173 టీఎంసీలుగా ఉంది… ఉంది.. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,78,003 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుండగా.. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. జల విద్యుత్ ఉత్పత్తి, రెండు గేట్ల ద్వారా 1,19,763 క్యూసెక్కుల నీరు డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నిండుకుండలా మారి గరిష్టస్థాయికి చేరింది నీటిమట్టం..
Read Also: RBI circular: అట్లయితే డబ్బులే. బంగారం ఇవ్వం. ఆర్బీఐ సర్క్యులర్.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇక, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడం, వరుస సెలవులు కావడంతో.. శ్రీశైలం డ్యామ్ సందర్శనకు క్యూ కడుతున్నారు పర్యాటకులు.. ఇవాళ శ్రావణ శుక్రవారం సెలవు ఉండగా.. ఆ తర్వాత శని, ఆదివారాలే కావడంతో.. క్రమంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి, డ్యామ్ సందర్శనకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేస్తే.. అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. డ్యామ్ నుంచి గేట్ల ద్వారా వచ్చే నీరు.. మళ్లీ పైకి ఎగిసిపడితే.. మనసు పులకించిపోతుంది.. ఇక, ఆ నీటి తుంపర్లు.. ఘాట్ రోడులపై వెళ్తున్న వాహనాలపై కూడా పడుతుంటాయి.. వాటిలో తడిసి ముద్దవ్వడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు.. అందుకే గేట్లు ఎత్తివేసి సమయంలో.. శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది.
మరోవైపు.. నాగార్జున సాగర్ డ్యామ్‌లోని నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,19,763 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వచ్చి చేరుతుండగా.. కుడి కాలువకు 1,969 క్యూసెకులు, ఎడమ కాలువకు 3,490 క్యూసెకులు.. మొత్తంగా 12,104 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు.. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిలువ 240 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 563 అడుగులకు చేరింది.. శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చిచేరుతుండడంతో.. సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది జులై నెల నుంచే నాగార్జున సాగర్‌కు వరద నీరు వచ్చిచేరుతోన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!