శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించింది కేఆర్ఎంబీ. రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవద్దని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. ఇప్పటికే రాసిన లేఖలపై ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో రెండు రాష్ట్రాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బోర్డు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది కేఆర్ఎంబి. ఈ సంవత్సరం మే నెల వరకు తెలంగాణకు మూడు…
ఈమధ్యకాలంలో అడవుల్లో పులులు రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం సంచలనం రేపుతున్నాయి. కొంతమంది వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం చేస్తున్నాయనే వీడియోలు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచరించినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీడియోలు ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.…
ఎప్పటి నుంచో ప్రత్యేక ఆదోని జిల్లా కోసం డిమాండ్ ఉంది. తాజా జిల్లాల పునర్విభజన ఆ డిమాండ్‌కు భిన్నంగా ఉండటంతో స్థానికులకు రుచించలేదు. టోన్ పెంచేశారు. ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నోరెత్తడం లేదట. దీంతో వారికేమైంది అని ఒక్కటే ప్రశ్నలు. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆదోని జిల్లా కోసం ఎప్పటి నుంచో డిమాండ్‌కర్నూలు జిల్లాలో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఇదే జిల్లాలో ప్రత్యేక…
శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. శివరాత్రి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆయన ఆదేశించారు. ఫిబ్రవరి 22 నుండి వచ్చే మార్చి 4 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలతో బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలన్నారు హరిజవహర్ లాల్. ప్రతి భక్తుడు మాస్క్ దరించేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలన్నారు హరిజవహర్ లాల్. జిల్లా అధికారుల సహకారంతో నడకదారి వచ్చే…
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శైవక్షేత్రాలు అప్పుడే సిద్ధం అవుతున్నాయి.. ఇక, మహాశివరాత్రి అనగానే ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం గుర్తుకు వస్తుంది.. శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. ఇక, శ్రీశైలంలో పిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు వెల్లడించారు.. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల…
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళదామని అనుకుంటున్నారా? అయితే కాసేపు ఆగండి. గతంలోలాగా దర్శనానికి వెళితే ఇబ్బందులు తప్పవంటున్నారు దేవస్థానం అధికారులు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా శ్రీశైలంలో ఆన్ లైన్ విధానం పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టారు. ఈనెల 25 నుంచి ఉచిత దర్శనం , రూ.150, రూ.300 దర్శనం, ఆర్జిత సేవల టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే పొందాలని ఈవో లవన్న తెలిపారు. భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ ధ్రువ పత్రం ఆన్ లైన్ లో…
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయంలో దర్శనానికి ఆంక్షలు విధిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అవకాశం ఉందన్నారు. స్పర్శదర్శనం, అంతరాలయ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. గతంలో టికెట్లు పొందినవారికి గర్భాలయ అభిషేకాలు పునః ప్రారంభం తరువాత అవకాశం కల్పిస్తామన్నారు. Read Also: గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు అటు ఆలయంలో తీర్థం, ఉచిత ప్రసాద…