PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు.
ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.