శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది..
కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద అధికారులు డ్యాం క్రెస్ట్‌గేట్లను మూసివేసి దిగువకు నీటి విడుదలను నిలిపివేయడంతో మత్స్యకారులు తమ దేశ పడవల్లో చేపల వేటకు పెద్ద సంఖ్యలో వచ్చారు . గత రెండు వారాలుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో డ్యాం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. అయితే గత రెండ్రోజుల నుంచి ఇన్ ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ క్రెస్ట్ గేట్లను మూసివేశారు. ఇన్ని…
ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.. ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున కాల్వలకి నీటి విడుదలపై ఆరా తీశారు.. అయితే, కృష్ణా జిల్లా ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి నిమ్మల అసహనం వ్యక్తం చేశారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల విషయంలో ఎస్ఈ నిర్లక్ష్యంపై నిమ్మల సీరియస్ అయ్యారు.. ఎస్ఈ ప్రసాద్ బాబుని ఈఎన్సీ కార్యాలయానికి సరెండర్ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు..
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. గంట గంటకూ నీటి మట్టం పెరుగుతూ శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 4,50,064 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తులో తెరచి నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ఉధృతి పేరుగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 4,82,401 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 10 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి కోసం మొత్తంగా 5,28,977 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు..
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌లోకి చేరుతోంది.
సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని…
Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి…
Srisailam Dam: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు ఇప్పటి వరకు ఏడు గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది.