Minister Nimmala Ramanaidu: గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు అన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.. దీనిపై అటు రైంతాంగంతో పాటు.. ఇటు ప్రభుత్వం పెద్దలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక, ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.. ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున కాల్వలకి నీటి విడుదలపై ఆరా తీశారు.. అయితే, కృష్ణా జిల్లా ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి నిమ్మల అసహనం వ్యక్తం చేశారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల విషయంలో ఎస్ఈ నిర్లక్ష్యంపై నిమ్మల సీరియస్ అయ్యారు.. ఎస్ఈ ప్రసాద్ బాబుని ఈఎన్సీ కార్యాలయానికి సరెండర్ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Dell Layoffs: 12,500 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న టెక్ దిగ్గజం.. రేపటి నుంచే లేఆఫ్స్..
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లలో జలకళ ఉందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్లు.. అన్ని ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయన్న ఆయన.. రాయలసీమకు సాగు, తాగు నీరు అందిస్తున్నాం. కృష్ణా డెల్టాలో కూడా నీటి విడుదల చేస్తున్నాం అన్నారు.. కాల్వలకు నీరు విడుదల చేస్తున్నాం. ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్నాం అని వివరించారు.. జగన్ ఐదేళ్ల కాలంలో కనీసం కాల్వలకు పూడికలు కూడా తీయలేదని విమర్శించారు.. ముందు కాల్వలు రిపేర్ల పనులు పూర్తి చేస్తామన్నారు.. ఇక, జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయిందంటూ సెటైర్లు వేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.