Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్‌లోకి చేరుతోంది. రైతుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సాగర్ ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు 4 గంటలకు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నీటి విడుదలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరనున్నారు. ఎగువన కృష్ణానదిలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు నిండిపోయాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాలి. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి 4.64 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 3,69,866 క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది.
Read also: Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?
దీంతో గత పదిరోజుల్లో సాగర్ నీటిమట్టం 34 అడుగులు పెరిగి ప్రస్తుతం 537.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఇంకా 53 అడుగుల నీరు పెరగాల్సి ఉంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం గురువారం సాయంత్రం 6 గంటలకు 183 టీఎంసీలుగా నమోదైంది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల్లోనే సాగర్‌లో నీటిమట్టం 11 అడుగులు పెరిగి 22 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో సాగర్ కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. మరోవైపు సాగర్ నుంచి కుడి కాలువకు ఇప్పటికే 4,152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్రవారం 2,2592 క్యూసెక్కుల నీటిని ప్రధాన పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు సన్నాహాలు చేశారు.
LB Stadium: నేడు దద్దరిల్లనున్న ఎల్బీ స్టేడియం.. 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సభ..