తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…
రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో…