రెండేళ్ల తరువాత మళ్లీ శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మిథిలా స్టేడియంలో రాముల వారి కళ్యాణం జరుగనుంది. కరోనా వల్ల ఈ రెండేళ్ల పాటు భక్తులు లేకుండా కళ్యాణాన్ని నిర్వహించిన దేవస్తానం ఇప్పుడు మాత్రం భక్తుల సమక్షంలోనే కళ్యాణాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. శ్రీరాముడిని హోలీ పండుగ రోజే పెళ్లి కుమారుడిని చేయడం ఆనవాయితీ.. అదే ఆనవాయితీని ఈరోజు స్వామి వారి పెళ్ళికొడుకుని చేసిన అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భద్రాచలంలో శ్రీసీతారామ చంద్ర స్వామి కళ్యాణం ఏప్రియల్ పదిన నిర్వహించనున్నారు. దీని కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా హోలీ పండుగ రోజునాడే శ్రీరాముడికి కళ్యాణం జరిగిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఏటా శ్రీరామ నవమి రోజునే భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం ప్రతి యేడాది ఈ కళ్యాణం జరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజునే కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో అదే సమయంలో అయోధ్యలో కూడా కళ్యాణం జరుగుతుంది. వాడ వాడలా కళ్యాణాలు జరుగుతుంటాయి. అయితే శ్రీరామ నవమి రోజే కళ్యాణం అయినప్పటికి అంతకు ముందు వచ్చే హోలీ పండుగ రోజున మాత్రం స్వామి వారిని పెళ్లి కొడుకుని చేయడం ఆనవాయితీగా సాగుతుంది. అదే ప్రక్రియ ఈ రోజు సాగింది.
జానక్యా: కమలాంజనలి పుటే యా: పద్మరాగాయతా: సీతాదేవి చేతుల్లో ఉన్న ముత్యాలు పద్మ రామమణుల్లా ప్రకాశించాయి. శ్రీ రాముడి శిరస్సుపై పడ్డ ఆముత్యాలు తెల్లని తలపాగా కాంతిలో కలిసి మంచి ముత్యాలుగా ప్రకాశిస్తాయి. నీలి మేఘ ఛాయ కలిగిన శ్రీరాముడి దేహం నుంచి జారిన తలంబ్రాలు ఇంద్రలీలామణుల్లా ప్రకాశిస్తాయిని, సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ముత్యాలు సఖల శుభాలను కలగచేస్తాయని ఆదిశంకరాచార్యులు చెప్పారంట. వివాహ వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైనది తలంబ్రాలు.. రామాలయంలో హోలీ పండుగ రోజునే శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలు ప్రారంభం అవుతాయి.
త్రేతా యుగంలో సీతారాముల కళ్యాణం హోలీ పండుగ రోజు అయిన పాల్గుణ పూర్ణిమ రోజునే కళ్యాణం జరిగిందని అంటుంటారు. అయితే అప్పటి నుంచి హోలీ పండుగ నాటి నుంచే శ్రీరామ చంద్రుల కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. చిత్ర కూట మండపంలో తలంబ్రాలు కలిపే ప్రక్రియ ప్రారంబం అయ్యంది. పసుపు కొమ్ములను రోళ్లలో వేసి దంచారు. సాంప్రదాయ బద్దంగా స్వామి వారికి ప్రత్యేకపూజలను చిత్రకూట మండపంలోనిర్వహించారు. అనంతరం ఆలయ పూజారుల సతీమణులు పసపుపునురోట్లో దంచారు. అలాగే తలంబ్రాలను కలిపారు. పసుపు, కుంకుమ,నెయ్యి బుక్క గులాం అత్తర్ పన్నీర్ నూసె సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను సిద్దం చేశారు. నిన్న ఒక్కరోజే ఇరవై క్వింటాళ్ల తలంబ్రాలను కలుపుగా, మొత్తం 80 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు
చేయనున్నారు. ఈ తలంబ్రాలకు ఒక్క ప్రత్యేకత కూడ ఉంటుంది. అన్ని కల్యాణాల్లో తలంబ్రాలు పసుపు పచ్చగా ఉంటాయి.
భద్రాచలంలో శ్రీసీతారామ చంద్ర స్వామి కళ్యాణంలో తలంబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈరోజు పెళ్లి కొడుకును చేసి ముత్తైవుదుల సమక్షంలో తలంబ్రాలను కలుపుతుంటారు. గత రెండేళ్లుగా ఈప్రక్రియకు బ్రేక్ పడింది. భద్రాచలంలో స్వామి ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈతలంబ్రాలను పలువరు భక్తులు తీసుకుని వెళుతుంటారు. ఏ పెళ్లిలో అయిన తలంబ్రాలు పసుప పచ్చగా ఉంటే ఇక్కడమాత్రం తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. ప్రధానంగా ఆనాడు నైజామ్ నవాబు ముత్యాల తలంబ్రాలను , వారి ఆచారం ప్రకారం గులాం కలిపి పంపించే వారు. ప్రధానంగా నైజాం నవాబు కళ్యాణం కోసం బియ్యం, పసుపు తో పాటు, వారి ఆచార సాంప్రదాయం అయిన గులాల్ ను కూడ కలిపి పంపారంట.
అయితే ఆరోజుల్లో గుర్రపు బగ్గీలో వస్తున్న ఈ తలంబ్రాలు అన్ని కలిసి ఎరుపు రంగుగా మారిపోయానని అంటారు. అప్పటి నుంచి ఇలా ఎరుపు రంగులోనే తలంబ్రాలు
వుంచడం ఆనవాయితీగా మారిందంట. భద్రాచలంలో తలంబ్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది. రాష్ర్టం నుంచే కాకుండా దేశం నుంచే చాలా మంది ఈ తలంబ్రాలు కావాలని కోరుకుంటారు. వివాహ సమయంలో ఈ తలంబ్రాలను కలిపితే మంచి జరుగుతుందని, శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం దీని వల్ల దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తుంటారు. అయితే అవి రెండు కలసి పోయి తలంబ్రాలు ఎర్రగా మారాయని అంటారు. అందువల్ల అప్పటి నుంచి ముత్యాల తలంబ్రాలలో సెంట్ తోపాటు సుగంధ ద్రవ్యాలను కలుపడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా అదే విదంగా వంద క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను కలిపారు.
నిన్న గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చిన అర్చకులు అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహావచనం, తదితర ప్రత్యేకపూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ రోజు స్వామివారికి సహస్రధారతో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. ఈసందర్బంగా అంగరంగ వైభవంగా వసంతోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఆ తరువాత డోలోత్సవాన్ని కొనసాగించారు. హోలీ పౌర్ణమిని పురస్కరిం చుకొని వసంతోత్సవాన్ని ముందుగా ప్రధాన ఆలయంలోని దృవమూర్తులకు, ఆంజనేయ స్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి వసంతాన్ని శాస్త్రోక్తంగా చల్లి వసంతోత్సవానికి చిహ్నంగా భక్తులపై పసుపు నీటిని చల్లారు.
రెండేళ్ల తరువాత స్వామి వారి కళ్యాణ ప్రక్రియ భక్తుల సమక్షంలో జరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు అయ్యారు. భారీసంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. భద్రాచలంలో శ్రీరామ నవమి రోజున కళ్యాణాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహించడం ప్రతియేటా సాగుతుండేది. అయితే గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇవి జరుగలేదు. అయితే ఈసారి మిథిలా స్టేడియంలో కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. దాని కోసం ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.