ఆ నియెజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు..? ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరిని కలవాలి..? తాము ఓట్లేసి గెలిపించిన నేతను కలవలేక పోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్న నేత ఎవరు? శాసనసభ్యునికంటే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆవ్యక్తికి అంత క్రేజ్ ఎందుకు? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎచ్చెర్లలో షాడో ఎమ్మెల్యేగా కిరణ్ మేనల్లుడు సాయి..!? గొర్లె కిరణ్‌కుమార్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే. బయట వ్యక్తులు ఈ పేరే చెబుతారు. అదే ఎచ్చెర్ల నియెజకవర్గం…
మనదేశంలో ఎన్నో వింత సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలను పూర్వకాలం నుంచి యథాతధంగా పాటిస్తూ వస్తుంటారు. అలాంటి వాటిల్లో జరుడుకాలనీ గ్రామదేవత జాతర ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తారు. సీతంపేట మండలంలోని జరుడుకాలనీ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు ఈ జాతరను…
మరోరెండు రోజులు ఏపీలో వర్షాలుబంగాళాఖాతంలోని అల్ప పీడనం కొనసాగుతుంది. జవాద్ తుఫాన్ ఒడిశాలోని పూరికి సమీపంలో బలహీనపడి తీరాన్ని దాటింది. అయితే పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీన పడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొన్నదని దీని ఫలితంగా మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జవాద్ తుఫాన్ బలహీన పడటంతో…
జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం…
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ…
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా,…
ఆయనదో టైపు..! అందరూ ఒకలా ఉంటే ఆయన మరోలా ఉంటారు. కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ నేతది ఎప్పుడూ డిఫరెంట్ స్టైలే. ఆయనకు పార్టీ కంటే సొంత ముద్ర వేసుకోవడమే బాగా ఇష్టం. తాజాగా ఆయన చేసిన పనితో పార్టీ విస్తుపోయింది.రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గమే అడ్డా.. అడ్డగోలు వ్యవహారాలు..? నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏది చేసినా తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. వరసగా రెండుసార్లు గెలిచిన కోటంరెడ్డి పార్టీకి తలనొప్పిగా…
పాములు కనిపించగానే హడలిపోతాం. వీలైతే అక్కడినించి పారిపోతాం. పాము కరుస్తుందేమోనని దాన్ని చంపేస్తాం. కానీ ఓ నాగుపాము హాయిగా పూజగదికి వచ్చేసింది. అయ్యప్పస్వాముల పూజ ఆసాంతం చూసింది. భజన వింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడు గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భజనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది ఓ నాగుపాము. అయ్యప్ప స్వాములు చేస్తున్న భజన కీర్తనలు వింటూ పైన ఏర్పాటు…
ప్రేమించానని చెప్పి నీలి చిత్రాలను తీశాడో ప్రబుద్ధుడు. ఆమె నీలి చిత్రాలు తీసి గ్రామస్తులకు బంధువులకు పంపడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. వారి వికృత చేష్టలకు మహిళలు,యువతులు బలవుతున్నారు. వీరఘట్టం మండలం నడుకురు సంఘటన మరువక ముందే రేగిడి మండలం కొత్త చెలికానివలస గ్రామంలో మరొక సంఘటన చోటుచేసుకుంది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ప్రేమించానని నమ్మించి నీలిచిత్రాలను చిత్రీకరించాడు. మద్యం మత్తులో నీలి చిత్రాలను కుటుంబీకులకు…
కామాంధులు రోడురోజుకు పేట్రేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ..చిన్నారులను కూడా వదలకుండా చిదిమేస్తున్నారు. తాజాగా ఒక గ్రామ వాలంటీర్, ఒక బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. . వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. సచివాలయం ఆదివారం మూసివేయాలి.. కానీ, హరిప్రసాద్ మాత్రం సచివాలయాన్ని తెరిచి పాడుపనులు చేస్తున్నాడు. గత నెల 31 వ తేదీన ఒక బాలికను మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకొచ్చాడు.…