దీపావళి పండుగ వచ్చింది దేశంలోని అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. నరకాసుడిని వధించిన రోజు కావడంతో ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. దీపావళి విశిష్టత గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, దీపావళి అన్నది మనకు తెలిసి పండుగ పేరు. కానీ, ఆ గ్రామస్తులకు మాత్రం అది పండుగతో పాటుగా ఆ గ్రామం పేరు కూడా. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరు…
శ్రీకాకుళం జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. శ్రీకాకుళం జిల్లా లెక్కలి పట్టణంలోని కచేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా.. పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘోర ప్రమాదం లో ఏకంగా ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి సాయి మరియు హరిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గాయాల పాలైన ఇద్దరు చిన్నారులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక విషయం తెలిసిన…
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్‌పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…
తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చాలామంది భక్తులు తిరుపతిలోని అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఒకసారి కాలినకడన ఎక్కడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ భక్తులు 300 సార్లు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు. 1996లో మొదటిసారి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్న శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాసరావు…
తెలుగు దేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న నిరసనలపై ఘాటు విమర్శలు చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగితే కేంద్రాన్ని అడగండి… ఇంట్లో జోడీగానే ఉన్నారుగా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కేంద్రాన్ని వదిలేసి… మా పై ఏడుస్తారెందుకు? అని ప్రశ్నించారు. 1,261 హామీలిచ్చి నెరవేర్చని మీదా దేవతల…
శ్రీకాకుళం : ఆమదాలవలసలో జనసేన శ్రేణుల పై వైసీపీ దాడిని ఖండించారు పవన్ కళ్యాణ్. దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? పోలీసుల సమక్షంలోనే ఆమదాలవలస జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేశారని పవన్ ఫైర్ అయ్యారు. సమస్యను తెలియజేసిన వారిని గాయపరిచి ఎదురు కేసులు పెడతారా ? జనసేన శ్రేణుల పై దాడులు చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం…
శ్రీకాకుళం సున్నాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు పోలీసులు సిబ్బంది మరణించారు. మృతుల్లో ఒక ఏఎస్ఐ , ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ , డ్రైవర్ ఉన్నారు. మందసలో ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీపు ఫ్రంట్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది జీపు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులలో కృష్ణుడు( ఏఎస్ఐ) , ఆంటోని( హెచ్.సీ) ,…
రాష్ట్రస్థాయి పదువులొస్తున్నాయంటే ఎగిరి గెంతులేశారు. ఏదేదో చేసేద్దామని బోల్డన్ని లెక్కలేసుకున్నారు. తీరా పదవులొచ్చాయక ఏమీ చేయలేక ఆవేదన చెందుతున్నారట. కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదట. వారెవరో.. ఆ బాధేంటో ఇప్పుడు చూద్దాం. పదవులు రావడంతో గుర్తింపు లభించిందని సంతోషించారు! ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టులతోపాటు డైరెక్టర్ పదవులు దక్కాయి. సామాజికవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు వస్తాయని..…
రాకరాక వారికి ఓ అవకాశం వచ్చింది. అక్కడ జగనన్న.. ఇక్కడ దాసన్న అండ ఉందని పదేపదే చెప్పుకొని మురిసిపోయారు. అట్టహాసంగా ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేస్తే.. వేదిక వెలవెల పోయిందట. కట్చేస్తే ఇప్పుడు ఆ అంశంపై వైసీపీలో అదేపనిగా చెవులు కొరుక్కుంటున్నారట. వీళ్లు పిలవలేదా లేక.. వాళ్లే రాలేదా అని చర్చించుకుంటున్నారట. గ్రాండ్గా సుడా ఛైర్పర్సన్ ప్రమాణ స్వీకారోత్సవం! శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతో ఇక్కడి వైసీపీ నేతలకు సీఎం జగన్ మనసులో ప్రత్యేక…
అంగన్వాడీ పాల అక్రమరవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. గతనెల 3వ తేదీన శ్రీకాకుళం భామిని మండలం బత్తిలిలో 1919 లీటర్ల పాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి , ఐదుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ పాల అక్రమరవాణా కేసులో 40 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విచారణలో వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు…