PSLV-C61: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన అధునాతన EOS-09 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం కోసం ఉద్దేశించబడిన PSLV-C61 మిషన్ విఫలమైంది. ప్రయోగించిన కొన్ని నిమిషాలకే రాకెట్ తన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో, శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఈ శాటిలైట్ రాత్రి సమయాల్లో కూడా హై రెజల్యూషన్‌తో ఫోటోలు తీసే టెక్నాలజీ ఉంది. అయితే, ఈ ప్రయోగం విఫలం కావడంపై శాస్త్రవేత్తలు దర్యాప్తు చేపట్టారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు…
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్…
ఇస్రోలో పని చేసే ప్రతి సైంటిస్ట్ కు నా సెల్యూట్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మనం సినిమా హీరోలకు కొట్టే చప్పట్లు కంటే ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలన్నారు. ఇస్రో సైంటిస్టులు మన దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్‌లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ (Agniban Rocket) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) వేదికగా మంగళవారం ఉదయం రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇస్రో శాస్త్రవేత్తలు వాయిదావేశారు. దీంతో నాలుగు సారీ రాకెట్ ప్రయోగం వాయిదాపడినట్లయింది. చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్…
Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.
Isro: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ ఉపగ్రహం INSAT-3DS ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌కి తరలించారు. ఈ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(GSLV-F14) ద్వారా ప్రయోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (MoES) కోసం బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు.