ISRO Chairman: అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం!
- చెంగాల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
- రాబోయే రోజుల్లో శుక్రగ్రహంపై పరిశోధనలు
- అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం అని పేర్కొన్నారు.
‘రేపు ఉదయం షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుండి జీఎస్ఎల్వీ ఏఫ్-15 రాకెట్‌ను ప్రయోగిస్తాం. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోంది. 2024లో కంటే ఈ ఏడాది రాకెట్ ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాదిలో గగన్‌యాన్.. చంద్రయాన్-4, జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీతో పాటూ మరో రెండు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు చేపడతాం. రాబోయే రోజుల్లో శుక్రగ్రహంపై పరిశోధనలు చేపడతాం. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. 1979లో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్వీ ఈ1 ద్వారా మొట్ట మొదటి రాకెట్ ప్రయోగం చేపట్టాం. రేపు శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని ఇస్రో చేపట్టబోతోంది. ఈ ప్రయోగంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేశీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే ఐదు ఉపగ్రహాలను పంపాము. మరో మూడు, నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను పంపుతాం. ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలను పంపుతాం. అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం’ అని ఇస్రో చైర్మన్ చెప్పారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!