PSLV C52 ప్రయోగం సక్సెస్ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా ఉ.5.59 గం.కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.18.31 నిమిషాల పాటు ప్రయాణించిన రాకెట్.. 1710 కిలోల బరువున్న IRSAT-1 తోపాటు మరో రెండు ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటివనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి. 2022లో ఇస్రో…
కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు , 4 టెక్నాలజీ డెమానేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్ -3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ( పీఎస్ఎల్వీ…
వాలంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ESO-04 లాంచింగ్‌ను ఫిబ్రవరి 14న జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 14న ఉదయం 5:59 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా నిర్వహించాలని తలపెట్టారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. Read Also:…
నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రంగా షార్ కేంద్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది… కేవలం ఒకేరోజు 142 పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కలవరం మొదలైంది.. ఇక, నిన్న 91 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా తేలింది… సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది.. దీంతో.. పెద్ద ఎత్తున కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే 50…
కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి…
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో…
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.. ఈ సారి నెల్లూరు జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది… ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం… ఇవాళ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని…