Nikhil: టాలెంట్ ఉన్న వ్యక్తులతో పనిచేయడానికి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటాడు. నిఖిల్ కెరీర్ ను ఒకసారి గమనిస్తే… అతని సినిమాలతో పరిచయమైన దర్శకులు చాలా మందే కనిపిస్తారు. నిఖిల్ ‘సూర్య వర్సెస్ సూర్య’ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అంతేకాదు… నిఖిల్ తాజా చిత్రం ‘స్పై’తో ”గూఢచారి, ఎవరు, హిట్” వంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్. దర్శకుడు అవుతున్నాడు. ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా కె. రాజ శేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతే ఈ చిత్రానికి కథను కూడా ఇవ్వడం విశేషం.
‘కార్తికేయ -2’తో పాన్ ఇండియా స్టార్ గా నిఖిల్ గుర్తింపు తెచ్చుకోవడంతో ‘స్పై’ చిత్రాన్ని కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ఇచ్చేశాడు. ఈ సినిమాను సమ్మర్ లో జనం ముందుకు తీసుకొస్తున్నట్టు అఫీషియల్ లీక్ ద్వారా తెలిపాడు. హై బడ్జెట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘స్పై’కు అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ ఎస్ట్రాడా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ గా అర్జున్ సూరిశెట్టి , ప్రొడక్షన్ డిజైనర్ గా రవి ఆంథోని పని చేస్తున్నారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అభినవ్ గోమటం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Official Leak 😉
Will be MASSIVE, Multi Language, National Thriller #SPY
This Summer 🔥🔥🔥 in Theatres Across India 🇮🇳 pic.twitter.com/g95PvSyQgw— Nikhil Siddhartha (@actor_Nikhil) January 30, 2023