Siva Kandukuri: ‘భూతద్దం భాస్కర్ నారాయణ’కు అంత ధీమా ఏమిటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Kandukuri: మంచి చిత్రాల్లో నటిస్తూ తనకంటూ నటుడుగా చక్కని పేరు తెచ్చుకుంటున్నాడు శివ కందుకూరి. అతను హీరోగా, రాశి సింగ్ హీరోయిన్ గా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ సినిమాతో పురుషోత్తం రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనిని స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదైంది. అలానే మోషన్ పోస్టర్ తో సినిమా కాన్సెప్ట్ ను మేకర్స్ తెలియచేశారు. వీటికి చక్కని స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాను మార్చి 31న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”మా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ధియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని ఏ సన్నివేశాన్ని ముందుగా ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది” అని తెలిపారు.
ఇదిలాఉంటే… మార్చి 30వ తేదీ అంటే ఈ సినిమాకు ముందు రోజున పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, నాని ‘దసరా’ మూవీలు విడుదల కావాల్సి ఉంది. ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీలో మార్పు ఉండొచ్చేమో కానీ నాని ‘దసరా’ మాత్రం అదే తేదీకి వస్తుందని తెలుస్తోంది. ఆ రకంగా చూస్తే, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ బరిలోకి దిగుబోతున్నాడనే అనుకోవాలి!
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..