Shiva Kandukuri: ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా నటించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తిక్ ముడుంబై నిర్మించిన ఈ సినిమాతో పురుషోత్తమ్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాశిసింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇదే నెల 31న విడుదల కావాల్సింది. కానీ సి.జి. వర్క్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో 31వ తేదీన సినిమాను విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రం బృందం తెలిపింది. ప్రైవేట్ డిటెక్టివ్ గా శివ కందుకూరి నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన తర్వాత సహజంగానే మూవీపై అంచనాలు పెరిగాయి. అరుణ్, దేవి ప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మీ, అంబటి శ్రీను తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.