సినిమా రంగంలో ప్రధానమైన యూనియన్లకు జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటుంటాయి. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆ తర్వాత డైరక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్లు కోలాహలంగా జరిగాయి. అదే కోవలో శ్రీరామనవమి రోజైన ఏప్రిల్ 10న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రెండు యూనియన్లు పోటీపడుతున్నాయి. ఒకటి జె. సాంబశివరావు ప్యానెల్ కాగా మరొకటి పి.ఎస్.ఎన్.దొర ప్యానెల్. ఈ యూనియన్ లో దాదాపు 600 మంది సభ్యులు మెంబర్స్ గా ఉన్నారు. ఈ సారి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ…
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతా సమేత జగదభిరాముడి శోభయాత్రను భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండు సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహించలేదు. అయితే రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో రామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది. గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో…
ఈరోజు అంటే ఏప్రిల్ 10, ఆదివారం నాడు రామ నవమిని జరుపుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు. త్రేతా యుగంలో అయోధ్యలో రాజు దశరథుడు, కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా, ఆ కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకుంటారు హిందువులు. ఈ రోజు పవిత్రమైన రామ నవమితో చైత్ర నవరాత్రి ముగియనుంది. విష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీరాముని పుట్టినరోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసము,…
ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు…
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర…