Adipurush : శ్రీరామనవమి స్పెషల్… ప్రభాస్ ఫ్యాన్స్ కు తప్పని నిరాశ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాఘవ రాముడిగా ప్రభాస్, జానకి పాత్రలో కృతి సనన్, లంకేష్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా సినిమాలో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాళ్లకు నిరాశ తప్పలేదు.
Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
డైరెక్టర్ ఓం రౌత్ ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో ఉన్న ఒక వీడియోను షేర్ చేస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఫస్ట్ లుక్ అయినా విడుదల అవుతుందేమో అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల ఆశలను ఆవిరి చేస్తూ సినిమాతో సంబంధంలేని ఒక వీడియోతో సరిపెట్టేశారు దర్శకుడు. దీంతో శ్రీరాముడిపై సినిమా చేస్తూ శ్రీరామ నవమి రోజున ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కాగా “ఆదిపురుష్”ను భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక “ఆదిపురుష్”ను వరల్డ్‌వైడ్ గా 3డిలో 2023 జనవరి 12న విడుదల చేయనున్నారు.
उफनता वीरता का सागर,
छलकती वात्सल्य की गागर।
जन्म हुआ प्रभु श्रीराम का,
झूमें नाचे हर जन घर नगर।।Celebrating the victory of good over evil✨#ramnavmi #adipurush pic.twitter.com/Xbl1kOgZ7z
— Om Raut (@omraut) April 10, 2022
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?