సినిమా రంగంలో ప్రధానమైన యూనియన్లకు జరిగే ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటుంటాయి. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆ తర్వాత డైరక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్లు కోలాహలంగా జరిగాయి. అదే కోవలో శ్రీరామనవమి రోజైన ఏప్రిల్ 10న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రెండు యూనియన్లు పోటీపడుతున్నాయి. ఒకటి జె. సాంబశివరావు ప్యానెల్ కాగా మరొకటి పి.ఎస్.ఎన్.దొర ప్యానెల్. ఈ యూనియన్ లో దాదాపు 600 మంది సభ్యులు మెంబర్స్ గా ఉన్నారు. ఈ సారి పోలింగ్ భారీగా జరుగుతోంది. బ్యాలెట్ పద్దతిలో జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రావటానికి బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
Read Also : Mahesh Babu : సితార ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్… వీడియోతో మహేష్ శ్రీరామ నవమి విషెస్