Bhadrachalam: శ్రీరామనవమిని పురస్కరించుకొని “దక్షిణ అయోధ్య”గా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం దశమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అర్చకులు సంపూర్ణ సమన్వయంతో భక్తులకు శ్రద్ధాభక్తులతో ఈ ఘట్టాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే భద్రాచలంలోని మిథిలా స్టేడియంకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీరామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది.
ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు…
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
నీ మనిషి నా మనిషి అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సొంత పార్టీ నేతలపై మరోసారి మండిపడ్డారు. "బీజేపీలో ఉన్న ఆ పెద్ద అధికారి మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తున్నారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్ కే వస్తాయి. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు అధికారి సీనియర్లు కనబడత లేరా?…