Lunar Eclipse: సంపూర్ణ చంద్రగ్రహణం కాలం నేడు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభం అయి అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతభిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున పండితులు జాగ్రత్తలు పాటించాల్సిన సూచనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసివేస్తున్నారు అధికారులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం స్వామివార్ల మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మూసివేత చేయనుంది. ప్రధాన ఆలయంతో పాటు…
Minister Seethakka : ములుగు జిల్లా అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క, మహా మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలతో శాశ్వత పనులు చేపడతామని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. సీతక్క మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత మహా జాతర సందర్భంగా, రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా పనులు పూర్తి…
బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది.…
యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు.
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు వైభవంగా జరగనున్నాయి.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజు ఉదయం వత్రశాయి అలంకరణ సేవ అత్యంత వైభవంగా కొనసాగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారి ఆలయాన్ని వేదపండితులు, అర్చకుల మంత్రోత్చరణల నడుమ ఎంతో వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయంలోని గర్భగుడి దర్శనాలు ఆరేళ్ళ తర్వాత పునఃప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో…