Lunar Eclipse: సంపూర్ణ చంద్రగ్రహణం కాలం నేడు మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభం అయి అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతభిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున పండితులు జాగ్రత్తలు పాటించాల్సిన సూచనలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ఆలయాలను మూసివేస్తున్నారు అధికారులు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం స్వామివార్ల మహా నివేదన అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మూసివేత చేయనుంది. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మూసివేయబడతాయి. ఇక సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి హోమపూజలు నిర్వహించి, ఉదయం 9:30 నుండి భక్తులకు దర్శన అనుమతించనున్నారు.
Ganesh Immersion: రెండో రోజు కొనసాగుతున్న వినాయక శోభయాత్ర
అలాగే, గ్రహణ సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయం ఉదయం 11:25 గంటలకు మూసివేయబడనుంది. గ్రహణ మోక్షం అనంతరం, సోమవారం ఉదయం 3:45 గంటల వరకు మూసివేత కొనసాగుతుంది. అనంతరం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు పూర్తయిన తరువాత భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు. ఈ రెండు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Today Astrology: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు!
కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం నేడు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేయబడనుంది. అనుబంధ ఆలయాలతో పాటు ద్వార బంధనం కూడా జరుగుతుంది. రేపు ఉదయం 7:30 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు దర్శనానికి తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రగ్రహణం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేయనున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. రేపటి ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి పూర్తయిన తరువాత, ఉదయం 7 గంటలకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంచనున్నారు.