Minister Seethakka : ములుగు జిల్లా అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క, మహా మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలతో శాశ్వత పనులు చేపడతామని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. సీతక్క మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత మహా జాతర సందర్భంగా, రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా పనులు పూర్తి చేయకుండా, కనీసం ఆరు నెలల సమయం తీసుకుని పూర్తి నాణ్యతతో పనులు చేయాలని కోరారు.
మహా జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ఈ మొత్తం సొమ్ము వినియోగించి, గత మహా జాతరపై మిగిలిన 50 కోట్ల రూపాయలను రానున్న మహా జాతర ఏర్పాట్లలో ఉపయోగించనున్నారు. మే 14వ తేదీన హైదరాబాదులో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలోని సుందరీమనులందరూ రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్బంగా, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.
మంగపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, జిల్లాను టాప్ స్థానంలో నిలిపిన జిల్లా అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Pahalgam terror attack: కాశ్మీర్‌పై పాక్ ఆర్మీ చీఫ్ విద్వేష వ్యాఖ్యలు.. అంతలోనే పహల్గామ్ ఉగ్రదాడి..