Yadagirigutta: లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేడు తిరు కల్యాణ మహోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21 వరకు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 18న జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవానికి కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రధాన మండపం ఉత్తర ప్రాంతంలో వాయుమార్గంలో నిర్మించిన లిఫ్ట్, రథశాల ప్రాంతంలో కల్యాణ వేదికతోపాటు వీవీఐపీ, వీఐపీ, మీడియా, దాతలు, ఆలయ అధికారులు, దాతలు, కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. 3,500 మంది కూర్చోవడానికి. 3 అడుగుల ఎత్తు, 42 అడుగుల వెడల్పు, 80 అడుగుల పొడవుతో కల్యాణ వేదికను రూపొందించారు. 10 వేల మంది స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా కొండపైన 8 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఏరియాలో 4, తూర్పు మాదా వీధిలో ఒకటి, క్యూ కాంప్లెక్స్ పైన ఒకటి, కొండపై బస్టాండ్ ఏరియాలో 2 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తారు.
Read also: MLC Kavitha Husband Anil: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
బ్రహ్మోత్సవాలు ఇలా..
ఈ నెల ఇవాళ యాదాద్రిలో స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, ఛత్రతీర్థం నిర్వహించనున్నారు. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18న ప్రధాన ఆలయ ఉత్తర ప్రాంతంలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతాల్లో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, మోకు సేవలను రద్దు చేశారు. , తిరు కల్యాణం మార్చి 19- ఉదయం శ్రీ మహా విష్ణు అలంకార సేవ, గరుడ వాహనసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం మార్చి 20- ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ సంగమం మార్చి 21- ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార నృత్య బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
RS Praveen Kumar: నేడు బీఆర్‌ఎస్ లోకి ఆర్‌ఎస్పీ.. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ..
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి