బాధ్యతగా ఉండాల్సిన ఆలయ సిబ్బంది తప్పటడుగులు వేశారు. దేవాలయంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ భక్తురాలు హుండీలో వేసిన నగలు మాయం చేశారని ఆలయ సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. అమిద్యాలకు చెందిన రంగయ్య, వనజాక్షి దంపతులు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూటగట్టి వనజాక్షి హుండీలో వేసింది. పంపకాలలో తేడాలు రావడంతో తిరిగి హుండీలో వేసినట్టు ప్రచారంసాగుతోంది.
Also Read:Prudhvi Raj : వారు ఇచ్చిన నమ్మకమే నన్ను నడిపించింది..
నిలువు దోపిడీ సమర్పించిన భక్తురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఏడవ తేదీన హుండీలో సొమ్ములు మూటకట్టి వేయగా.. రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు లెక్కింపులో చూపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. హుండీ లెక్కించే సమయంలో నగల మూట జంకాలం (మ్యాట్) కింద ఉండిపోవడంతో గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు. భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు ఉన్నతాధికారులకు తెలపక పోవడంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ఈవో రమేష్ ను ప్రశ్నించారు.
Also Read:Mohanlal : ‘L2E: ఎంపురాన్’ మరచిపోలేని జర్నీ..
హుండీ కౌంటింగ్ అనంతరం జంకాలాలు (మ్యాట్) తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగల మూట కనిపించడంతో తిరిగి తనకు అప్పగించారని వెంటనే హుండీలో వేశానని ఆలయ ఈవో విచారణ అధికారులకు చెప్పారు. సిబ్బంది చేతివాటం ఘటనపై విచారణ చేపట్టి… బాద్యులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు తెలిపారు.