IPL 2025: ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పీడకలగా మారింది. సీజన్ ఆరంభం నుంచి హైదరాబాద్ జట్టుకు ఏ మాత్రం కలిసిరాలేదు. తొలి మ్యాచ్ అద్భుతంగా ఆడినప్పటికీ ఆ తరువాత చతికిలపడిందీ. ఏడు మ్యాచ్ లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్ ని వర్షం దెబ్బకొట్టింది. దీంతో SRH అఫీషియల్ గా టోర్నీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. ఇక చివరి మూడు మ్యాచ్ ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలన్న సన్ రైజర్స్ కు హెడ్ రూపంలో భారీ షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న మ్యాచ్ కి ముందు ఆ జట్టు స్టార్ ఆటగాడు, ట్రావిస్ హెడ్ కరోనా బారీన పడ్డాడు. ప్రస్తుతం హెడ్ ఆస్ట్రేలియాలో ఐసొలేషన్ లో ఉన్నాడు.
Read Also: Health Tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?.. ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ఇక, ఈ విషయాన్నీ సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ అధికారికంగా సమాచారం అందించాడు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆ జట్టుకు హెడ్ దూరమవడంతో ఓనర్ కావ్య మారన్ కు ఏం చేయాలో అర్ధం కావడం లేదట. మూలిగే నక్కపై తాటి పండు పడడం అంటే ఇదేనేమోనని కొందరు క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. హెడ్ దూరం కావడంతో అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా SRH 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 25న కోల్ కత నైట్ రైడర్స్ తో తలపడనుంది. దీంతో SRH కు లీగ్స్ దశ ముగిసిపోతుంది.