మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటజీవితం భావితరాలను సైతం ప్రభావితం చేస్తూనే ఉంది. నవతరం ప్రేక్షకులు సైతం యన్టీఆర్ నటించిన చిత్రాలను బుల్లితెరపైనా, చిత్రోత్సవాల్లో చూసి ఆనందిస్తున్నారు. ఈ నాటి మేటి నటీనటులు సైతం ఆ మహానటుని అభినయపటిమను శ్లాఘిస్తున్నారు. నటనలో రాణించాలనుకొనేవారు నటరత్న నటనావైభవాన్ని అధ్యయనం చేయాలని తపిస్తున్నారు. నటసార్వభౌముని జయంతి సందర్భంగా అధ్యయనం చేయవలసిన ఆయన శత చిత్రాలను మీ కోసం ఎంపిక చేశాం. ఇవే కాకుండా మరో వందకు పైగా…
ఇప్పుడు తరచూ ‘పాన్ ఇండియా మూవీ’ అంటూ వినిపిస్తోంది. అసలు ‘పాన్ ఇండియా మూవీ’ అంటే ఏమిటి? భారతదేశమంతటా ఒకేసారి విడుదలయ్యే చిత్రాన్ని ‘పాన్ ఇండియా మూవీ’ అన్నది సినీపండిట్స్ మాట! కొందరు ఉత్తరాదిన హిందీలోనూ, దక్షిణాది నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లో విడుదలయ్యే సినిమాలు అంటూ చెబుతున్నారు. ఇప్పుడంటే కన్నడ, మళయాళ సీమల్లోనూ సినిమాలకు క్రేజ్ ఉంది కానీ, ఒకప్పుడు దక్షిణాదిన సినిమా అంటే తెలుగు, తమిళ చిత్రాలే! ఉత్తరాదిన హిందీ,…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు అని అభిమానులు ఆ విఖ్యాత నటుణ్ణి ఆరాధించేవారు. కొందరు కొంటె కోణంగులు అప్పట్లో ‘విశ్వం’ అంటే ‘ఆంధ్రప్రదేశా?’ అంటూ గేలిచేశారు. అయితే నిజంగానే యన్టీఆర్ తన నటనాపర్వంలోనూ, రాజకీయ పర్వంలోనూ అనేక చెరిగిపోని, తరిగిపోని రికార్డులు నెలకొల్పి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. ముందు నవ్వినవారే, తరువాత ‘విశ్వవిఖ్యాత’ అన్న పదానికి అసలు సిసలు న్యాయం చేసిన ఏకైన నటరత్నం అని కీర్తించారు! అదీ యన్టీఆర్ సాధించిన ఘనత! ఆయన ఏ నాడూ…
యన్.టి.ఆర్. అన్న మూడక్షరాలు వినగానే తెలుగువారి మది పులకించిపోతుంది. రామారావుకు సంబంధించిన అనేక అంశాలు తెలుగువారికి పరమానందం పంచాయి. నిజజీవితంలో తారకరామ నామధేయుడు – తెరపై శ్రీరామునిగా మెప్పించిన నటధీరుడు. మన పురాణపురుషుల పాత్రలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియవు. రవివర్మ చిత్రాల ద్వారా తెలుసుకోగలిగాం. ఆ చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా నందమూరి నటన సాగింది. శ్రీరాముడు అంటే యన్టీఆర్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా ఆయన జనం మదిలో నిలిచారు. రామ పాత్రలో రామారావు అభినయం…