Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్ కరుణ్ నాయర్ అంటే చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ టెస్ట్ ల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ అంటే గుర్తొస్తుంది. ఇప్పుడు అతని పేరును ఎందుకు గుర్తుచేస్తున్నారు అనుకుంటున్నారా. మళ్లీ తన పేరును క్రికెట్ అభిమానులు తలుచుకోక తప్పదు. ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కొన్ని రోజుల వరకు బాగానే అవకాశాలు వచ్చాయి.. ఐపీఎల్ లో కూడా ఆడాడు. కానీ మెరుగైన ప్రదర్శన చూపించకపోవడంతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో శతక్కొట్టాడు.
Jailer: ‘జైలర్’ పై కేసు పెట్టిన RCB.. గట్టి షాక్ ఇచ్చిన హైకోర్టు
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో కరుణ్ నాయర్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా నాయర్ కొనసాగుతుండగా.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నాయర్ తో పాటు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశారు. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం 249 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుల్భర్గా.. 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చివరకు గుల్భర్గా పోరాడినప్పటికీ.. విజయం దక్కలేదు. ఇక గుల్భర్గా ఇన్నింగ్స్‌లో మాక్నిల్ హాడ్లి 61, హసన్ ఖలీద్, 54, చేతన్, 28 పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి 2, కుశాల్ వాధ్వాని 2, గౌతమ్ మిశ్రా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim
— CricTracker (@Cricketracker) August 28, 2023
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!