IBSA World Games: శభాష్.. ఫైనల్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫైనల్స్లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. IBSA వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది. బుధవారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ దశలో భారత మహిళల జట్టు వరుసగా మూడో గెలుపుతో ఫైనల్‌కు అర్హత సాధించింది.
Special Focus: చంద్రుడిపై మానవుడు ఉండొచ్చా..? భూమి, చంద్రుడు దగ్గరగా వస్తే ఏం జరుగుతోంది..?
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
బర్మింగ్‌హామ్ వేదికగా టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మీట్‌లో ఇండియా వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలపై గెలుపొంది, తుదిపోరుకు అర్హత సాధించింది. భారత మహిళా క్రికెట్ జట్టు ఆగస్టు 20న టోర్నమెంట్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడినప్పుడు, విమెన్ ఇన్ బ్లూ ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచింది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ గేమ్స్‌లో తమ ప్రస్తానాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. మహిళల అంధుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాను 59/6కి పరిమితం చేసింది.
YouTube: మ్యూజిక్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హెచ్. గంగవ్వ 60 బంతుల్లో 117 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 268/2 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 185 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. బుధవారం (ఆగస్ట్ 23) జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 163 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, వరల్డ్ గేమ్స్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్స్‌కు చేరింది. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించగా, టైటిల్ పోరు శనివారం జరగనుంది. ఫైనల్స్‌కు ముందు భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను గురువారం ఇంగ్లండ్‌తో ఆడనుంది. కాగా, పురుషుల గేమ్‌లో భారత్ శుక్రవారం సెమీఫైనల్‌ను ఆడనుంది. సెమీఫైనల్ పోరులో భారత జట్టు గెలిస్తే, IBSA వరల్డ్ గేమ్స్ 2023 ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది.
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!