ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అంబటి రాయుడు.. మళ్లీ ఆడటానికి సిద్ధమయ్యాడు. మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ లో బలమైన సారథిని నియమించాలని బంగ్లా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని ఎంపిక చేశారు.
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో భారత జట్టు టాస్ ఓడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్కు రానుంది.
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో తెలుగుతేజం తిలక్ వర్మ మళ్లీ మెరిశాడు. తొలి టీ20లోనే అత్యుత్తమ ప్రదర్శన చూపించిన తిలక్.. 39 పరుగులు చేశాడు. ఇక ఈరోజు జరిగిన రెండో టీ20లోనూ అర్థసెంచరీ సాధించాడు.
‘నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు అతను బీహార్ టీమ్ కు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని దగ్గర బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్కిల్స్ని దగ్గర్నుంచి గమనించా. తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. స్పిన్ బౌలింగ్ అయినా పేస్ బౌలింగ్లో అయినా అద్భుత షాట్లు ఆడుతున్నాడు. అని సబా కరీం తెలిపాడు.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్ ప్రత్యర్థులకు ఊచకోత చూపించాడు. ఇంతకు ముందు క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేయని జోర్డన్.. సిక్సర్ల సునామీ చూపించాడు. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు.