Asia Cup 2023: ఫైనల్లో గెలవడంపై టీమిండియాపై అభినందనల వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా టైటిల్ గెలుచుకుంది. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అంతకుముందు పాకిస్తాన్-శ్రీలంక ఆడిన మ్యాచ్ లో స్పిన్ కే ఎక్కువగా అనుకూలించింది. అందరూ శ్రీలంక స్పిన్నర్ యువ స్పిన్నర్ వెల్లలేగేపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో తారుమారైంది. మరోవైపు భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు. అయితే ఈ ఫైనల్ లో భారత్ 50 పరుగులకే శ్రీలంకను ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. కేవలం 37 బంతుల్లోనే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం మహ్మద్ సిరాజ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర సాధించాడు.
Read Also: Game Changer : గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?
Also Read
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. భారత జట్టు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు’ అని రాశాడు. శ్రీలంక క్రికెట్‌కు ఇది కష్టమైన రోజు. మహ్మద్ సిరాజ్ స్పెల్‌ను హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, మిథాలీ రాజ్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో సహా పలువురు క్రికెటర్లు టీమిండియా విజయానికి అభినందనలు తెలిపారు.
Read Also: Asaduddin Owaisi : అల్లా మా రూలర్.. అల్లా కోసమే ఉన్నాం.. అల్లా కోసమే పని చేస్తున్నాం..
తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరుఫున మహ్మద్ సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 7 ఓవర్లలో 21 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్ అత్యధికంగా 17 పరుగులు చేశాడు. 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత చిన్న టార్గెట్ ను భారత జట్టు 6.1 ఓవర్లలోనే విజయం సాధించింది. శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ నాటౌట్‌గా నిలిచారు.
- Tags
- asia cup
- final
- india
- Sports
- telugu news
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!