టీమిండియా కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తిరస్కరించాడు. అందుకు గల కారణాలను ఆయన వెల్లడించాడు. నేషనల్ టీమ్‌తో కలిసి సీనియర్ కోచ్‌గా పని చేయాలని ఆసక్తి ఉందని చెప్పాడు.. కానీ ఓ కారణంతో బీసీసీఐ ఆఫర్‌కు నో చెప్పినట్లు రికీ పాంటింగ్ తెలిపాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపలేమో అన్న ఆలోచనతో కోచ్ పదవిని తిరస్కరించానని చెప్పాడు. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగమని…
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరును చేసింది. ముంబై ఎదుట 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు.
టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది.
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది.