పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారత్ 213 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40), శుభ్‌మన్ గిల్ (34) శుభారంభం అందించగా.. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (58), రిషభ్ పంత్ (49) కూడా దంచికొట్టారు.
ఇండియా, శ్రీలంక జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఈ రోజు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్ల కెప్టెన్లు కొత్తవారే. ఈ పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక విజయంతో సిరీస్‌ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు.
షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ తరఫున టీ20 ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, "నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు పునరాగమనం చేసింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పుడు మూడో మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 183 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(66), రుతురాజ్(49)లు రాణించారు.
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ హరారే వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి టీ-20 మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో షాక్ తిన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారో కానీ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తేలిపోయారు.