పారిస్ ఒలింపిక్ విజేతలు నేడు ప్రధాని మోడీ కలిశారు. జులై 26న ప్రారంభమై ఆగస్టు 11న ముగిసిన విషయం తెలిసిందే. భారత్ నుంచి117 మంది సభ్యుల బృందం పారిస్ వెళ్ళింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు. స్వదేశానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు స్వాగతం పలికారు. ఇప్పుడు ఆటగాళ్లు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆగస్టు 15 (గురువారం) కలిశారు. దీనికి సంబంధించిన మొదటి వీడియో బయటపడింది.
READ MORE: Train Accident: మరో రైలు ప్రమాదం.. ఊడిపోయిన రెండు కోచ్‌లు
ప్రధానికి బహుమతులు..
ప్రధాని మోడీకి భారత ఆటగాళ్లు బహుమతులు ఇచ్చారు. షూటర్ మను భాకర్ ప్రధానికి పిస్టల్ ఇచ్చింది. రెజ్లర్ అమన్ సెహ్రావత్, హాకీ యోధుడు పీఆర్ శ్రీజేష్ భారత ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీలను అందజేశాడు. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తన జట్టు తరపున ప్రధానమంత్రికి హాకీ స్టిక్‌ను బహుకరించాడు. ఈ సందర్భంగా ఆటగాళ్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అయితే ఆటగాళ్లతో ప్రధాని ఏం మాట్లాడారనే వీడియో మాత్రం ఇంకా బయటకు రాలేదు.
READ MORE: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
కొంతమంది భారత ఆటగాళ్లు ఇంకా స్వదేశానికి తిరిగి రాలేదని తెలిసిందే. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జర్మనీలో ఉన్నాడు. అక్కడ అతను శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. కాగా.. రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆగస్టు 17న భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ ఈవెంట్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా పాల్గొనలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో 16వ రౌండ్‌లో ఓడిపోవడం ద్వారా సింధు చరిత్రాత్మక హ్యాట్రిక్ పతకాలను కోల్పోయింది. ప్రధానిని కలవడానికి ముందు భారత క్రీడాకారులు కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల ముగిసిన క్రీడల్లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
READ MORE:Train Accident: మరో రైలు ప్రమాదం.. ఊడిపోయిన రెండు కోచ్‌లు
ఈ 6 మంది అథ్లెట్లు పారిస్‌లో పతకాలు సాధించారు
🥈నీరజ్ చోప్రా
🥉మను భాకర్
🥉మను భాకర్/సరబ్జోత్ సింగ్
🥉స్వప్నిల్ కుసాలే
🥉అమన్ సెహ్రావత్
🥉హాకీ
#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024