విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది.
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్తో బరిలోకి దిగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు జరిగాయి. లోక్సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేసింది.. ఆ షెడ్యూల్ ను త్వరలోనే విడుదల కానుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ సీజన్ 17 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.