Top Five Sportswear in the World: సచిన్ టెండుల్కర్‌ని చూస్తే ఎంఆర్‌ఎఫ్ బ్రాండ్ గుర్తుకొస్తుంది. సానియా మీర్జా కనపడగానే జీవీకే కంపెనీ పేరు కళ్ల ముందు కదులుతుంది. క్రీడాకారులు ధరించే బ్రాండ్స్‌కి ఆ రేంజ్‌లో గుర్తింపు వస్తుంది. ఆయా సంస్థలు ప్రపంచం మొత్తం తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ ఫీల్డ్‌లో లేరు. రిటైర్ అయ్యారు. కానీ.. ఇతర ప్లేయర్లు కొందరు వాళ్ల రేంజ్‌లోనే అభిమానులను అలరిస్తున్నారు. తద్వారా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.